Skip to main content

Department of Education: పరీక్షల నిర్వహణ నిధులగోల్‌మాల్‌పై కదలిక

కర్నూలు సిటీ: ప్రభుత్వ పరీక్షల విభాగంలో చోటు చేసుకున్న నిధుల గోల్‌మాల్‌పై విద్యాశాఖలో కదలిక వచ్చింది.
Movement on Examination Conduct Funds
పరీక్షల నిర్వహణ నిధులగోల్‌మాల్‌పై కదలిక

 ఏటా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం నిధులు కేటాయిస్తుంది. ఈ నిధుల ఖర్చుకు సబంధించిన బిల్లులు పరీక్షలు ముగిసిన 15 రోజుల్లోపు సమర్పించాలి. కానీ 2022–23 పదో తరతగతి పరీక్షలు ముగిసి ఆరునెలలు అవుతున్నా నేటికీ పూర్తి స్థాయిలో బిల్లులు సమర్పించలేదు. దీనిపై అక్టోబ‌ర్ 12వ తేదిన సాక్షి దినపత్రికలో ‘పరీక్ష నిధులు..తేలని లెక్కలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. దీనిపై పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాలయ అధికారి వెంకట కృష్ణారెడ్డి స్పందించారు.

చదవండి: విద్యార్థుల ఫీజులు మాయం

పరీక్షలు జరిగిన సమయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన ఎ. చౌడేశ్వరిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మొదటగా ఆమె వివరణ కోరేందుకు అక్టోబ‌ర్ 19న‌ షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దీనిపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే విషయంలో ఇప్పటికే ఆ విభాగంలో పని చేసే సెక్షన్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు. కానీ కీలక అధికారులు తేలని లెక్కల చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Published date : 20 Oct 2023 05:25PM

Photo Stories