టీచర్ల నిర్బంధ బదిలీలకు గరిష్ట సర్వీస్ ఐదేళ్లు
అలాగే జీరో సర్వీస్‌తో టీచర్ల బదిలీలను కూడా అనుమతించనున్నట్టు చెప్పారు. జీవో–117, సవరణ ఉత్తర్వు–128కు సంబంధించి తలెత్తిన అంశాలపై జూలై 19న ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చించారు. ఆగస్టులో బదిలీల ప్రక్రియ ఉంటుందని మంత్రి పేర్కొన్నట్టు సమావేశ అనంతరం ఆయా సంఘాల నేతలు తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ప్లస్–2 (ఇంటర్మీడియెట్ తరగతుల) ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్నట్టు సంఘాల నాయకులకు మంత్రి చెప్పారు. 2008–డీఎస్సీలో ఎంపికై మినిమమ్ టైమ్ స్కేల్‌పై ఇటీవల పోస్టింగులు పొందిన టీచర్లకు మే 6వ తేదీ నుంచి జీతాలు చెల్లించేలన సంఘాలు కోరగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: KGBV: టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
పాత అంశాలను పునరుద్ఘాటించిన సంఘాలు
ఇలా ఉండగా జీవో–117పై ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు. అనంతరం జీవోకు కొన్ని సవరణలు చేస్తూ జీవో–128ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. అయితే మంత్రి ఇచ్చిన హామీల మేరకు సవరణలు చేయలేదని సంఘాలు మళ్లీ తమ ఆవేదనను వ్యక్తపరిచాయి. మంత్రి తాజాగా నిర్వహించిన సమావేశంలో సంఘాల నేతలు ఇవే అంశాలను పునరుద్ఘాటించారు.
చదవండి: 1998 DSC: కలల కొలువు దక్కింది.. జీవిత చిత్రం మారింది
జీరో సర్వీస్‌నూ అనుమతించడం హర్షదాయకం
వివిధ సమస్యలను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో–117 వల్ల టీచర్ల పోస్టులు అనేకం మిగులుగా మారుతాయని, దీనివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని మంత్రికి వివరించామని ఫ్యాప్టో నేతలు ఎన్.వెంకటేశ్వర్లు, మంజుల, వి.శ్రీనివాసరావు, కేఎస్‌ఎస్ ప్రసాద్, జి.హృదయరాజు, జీవీ నారాయణరెడ్డి, ఎంవీఎస్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. టీచర్ల నిర్బంధ బదిలీలలో గరిష్ట సర్వీస్‌ను 8 ఏళ్లకు బదులు 5 ఏళ్లకు తగ్గించడం సరికాదని, దీనివల్ల అనేక మంది నష్టపోతారని ఏపీ పీటీఏ నేతలు ఏజీఎస్ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు తెలిపారు. టీచర్ల బదిలీల్లో జీరో సర్వీస్‌ను కూడా అనుమతించడం హర్షదాయకమని బహుజన్ టీచర్ల అసోసియేషన్ నేతలు శరత్‌చంద్ర, ఎం.సురేష్‌బాబు పేర్కొన్నారు.