Skip to main content

New Courses: కోర్సుల కోలాహలం

ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ స్థాయిలో న్యాయశాస్త్ర కోర్సులను ప్రారంభించాలన్న పదేళ్ల స్వప్నం ఇన్నాళ్లకు సాకారమవుతోంది.
New Courses
కోర్సుల కోలాహలం

పలు కారణాలతో ఏఎన్‌యూలో డిగ్రీ స్థాయిలో న్యాయశాస్త్ర కోర్సులను ఇరవై ఏళ్ల క్రితం రద్దు చేశారు. ఆ తరువాత న్యాయశాస్త్ర కోర్సులకు పెరిగిన డిమాండ్‌, మారుతున్న పరిస్థితులకనుగుణంగా మళ్లీ డిగ్రీ స్థాయిలో లా కోర్సులను ప్రారంభించాలని పదేళ్ల క్రితమే చర్యలు చేపట్టారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు ఫలించలేదు. ప్రస్తుతం సాకారం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పూర్వ విద్యార్థుల సంఘం వినతితో..

ఏఎన్‌యూలో ఎల్‌ఎల్‌బీ కోర్సులను మళ్లీ ప్రారంభించాలని న్యాయశాస్త్ర పూర్వ విద్యార్థుల సంఘం పలుమార్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించింది. దీంతో ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉన్న రంగాలకు అనుసంధానంగా లా కోర్సులను నిర్వహిస్తే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల నిర్వహణకు యూనివర్సిటీ స్థాయిలో అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి బీసీఐ(బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా)కు పంపింది.

చదవండి: National Law University: జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి వచ్చే నెలలో శంకుస్థాపన

సెల్ఫ్‌ఫైనాన్స్‌ విధానంలో నిర్వహణ

యూనివర్సిటీలో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల నిర్వహణకు బీసీఐ అనుమతి మంజూరు చేయడంతో 2023–24 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులకు ప్రవేశాలు నిర్వహించనున్నారు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో ఈ కోర్సులకు ఒక్కో సెమిస్టర్‌కు రూ.25 వేలు ఫీజుగా నిర్ధారించారు. ఒక్కొక్క కోర్సులో 60 సీట్లు ఉంటాయి. కొత్త కోర్సులకు బీఓఎస్‌(బోర్ట్‌ ఆఫ్‌ స్టడీస్‌) చైర్మన్‌గా ఏఎన్‌యూ న్యాయశాస్త్ర విశ్రాంత అధ్యాపకులు ఆచార్య ఎన్‌.రంగయ్యను నియమించారు.

చదవండి: Awareness of laws: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విశ్రాంత అధ్యాపకులు, న్యాయమూర్తులతో బోధన

కొత్తగా అందుబాటులోకి తెస్తున్న కోర్సులకు ఏఎన్‌యూ న్యాయశాస్త్రంలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆచార్య వై.ఆర్‌.హరగోపాల్‌రెడ్డి, ఆచార్య ఎన్‌.రంగయ్యతోపాటు పలువురు విశ్రాతం అధ్యాపకులు, సుప్రీంకోర్టు, హైకోర్టులలో పని చేసిన విశ్రాంత న్యాయమూర్తులతోపాటు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు పాఠ్యాంశాలు బోధించనున్నారు. ఏఎన్‌యూలో ఎల్‌ఎల్‌బీ కోర్సులు ప్రారంభిస్తే తాము సేవలు అందించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతోపాటు పలువురు విశ్రాంత న్యాయమూర్తులు ఇటీవల జరిగిన ఏఎన్‌యూ లా పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రకటించారు.

ప్రత్యేక వసతులు

న్యాయశాస్త్ర కోర్సుల కోసం ప్రత్యేక మౌలిక వసతులను యూనివర్సిటీ ఉన్నతాధికారులు అందుబాటులోకి తెచ్చారు. లా కోర్సులన్నింటినీ కలిపి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ విభాగంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక హంగులతో భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. 5 వేలకుపైగా పుస్తకాలతో లైబ్రరీని సిద్ధం చేశారు.

వసతులు కల్పించని గత పాలకులు

ఏఎన్‌యూలో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుల ప్రారంభానికి పదేళ్ల క్రితమే చర్యలు ప్రారంభించారు. బీసీఐకి ప్రతిపాదనలూ పంపారు. బీసీఐ బృందం ఏఎన్‌యూలో పర్యటించి మౌలిక వసతులు, అధ్యాపకులు లేరని స్పష్టం చేసింది. కానీ అప్పటి పాలకులు ఈ కోర్సుల ప్రారంభానికి నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం బీసీఐ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో అన్ని అనుమతులూ మంజూరయ్యాయి.

Published date : 14 Aug 2023 05:09PM

Photo Stories