Skip to main content

KTR: విద్యార్థినులకు కేటీఆర్ సాయం

ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉండే ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు మరోసారి తన ఔదార్యాన్ని చాటు కున్నారు.
KTR
కావేరి, శ్రావణిలకు ఆదివారం చెక్కురూపంలో ఆర్థికసాయాన్ని అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన అక్కా చెల్లెళ్లు కావేరి (21), శ్రావణి (18)ల ఉన్నత విద్య పూర్తయ్యేంత వరకు అండగా నిలుస్తానని హామీఇచ్చారు. తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థిని కావేరి సిద్దిపేట సురభి కాలేజీలో చదువుతోంది. ఆమె సోదరి శ్రావణి కూడా మోడల్‌ స్కూల్‌లో చదివి ఏపీలోని తాడేపల్లిగూడెం ఎన్ ఐటీలో బీటెక్‌ (ఈసీఈ)లో సీటు సాధించింది. ఇద్దరూ మెరిట్‌ కోటాలోనే ఉన్నత విద్యా కోర్సుల్లో సీటు సాధిం చారు. బీఏ గ్రాడ్యుయేట్‌ అయిన వీరి తండ్రి రాజమల్లు గతంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేయగా, కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నారు. ట్విట్టర్‌ ద్వారా వీరి పరిస్థితి కేటీఆర్‌కు చేరగా, మార్చి 6న రాజమల్లు తన కూతుళ్లతో కలిసి కేటీఆర్‌ను కలిశారు. వారి అవసరాలను తెలు సుకున్న కేటీఆర్‌ ఉన్నత విద్యను పూర్తి చేసుకునేంత వరకు సాయంగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమను ఆదుకునేందుకు కేటీఆర్‌ ముందుకు రావడం పట్ల విద్యారి్థనులు కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: 

​​​​​​​English Medium: ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం

Jobs: ఐటీ కారిడార్‌తో లక్ష ఉద్యోగాలు

Sabita: ఆటో నడుపుతున్న విద్యార్థినికి.. కేటీఆర్‌ అండ

Indian School of Business: కొత్త కోర్సులు అందుబాటులోకి

Published date : 07 Mar 2022 05:10PM

Photo Stories