Skip to main content

Sabita: ఆటో నడుపుతున్న విద్యార్థినికి.. కేటీఆర్‌ అండ

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న నల్లగొండ విద్యారి్థని సబితకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.
sabita
సబితకు, ఆమె తల్లికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు, ఆటో మంజూరు పత్రాలను అందజేస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి

నల్లగొండలో సబిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని, ధైర్యంగా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి.. జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. ఆమెను స్వయంగా కలసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచి్చన హామీ మేరకు సబితను ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో ప్రగతిభవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. చిన్నవయసులోనే కుటుంబ పోషణ కోసం ఆటోను నడిపిస్తూ మగవారికి తీసిపోని విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న సబిత తీరును చూసి ఆయన అభినందించారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తండ్రిని కోల్పోవడంతో తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచి్చందని తెలిపింది. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయం చేయాలని, కొత్త ఆటోరిక్షా ఇప్పించాలని సబిత కోరింది. కాగా, సబిత పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్‌ బెడ్‌రూం ఇంటి ప్రొసీడింగ్స్‌తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్‌ని కేటీఆర్‌ స్వయంగా అందించారు. సబిత చదువుకుంటానంటే తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఇతర యువతులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కేటీఆర్‌ తనకు అండగా నిలవడంపై సబిత సంతోషం వ్యక్తం చేసింది.

చదవండి: 

WhatsApp: డిజిటల్ స్కిల్ పై వాట్సాప్ శిక్షణ

Dr Rajiv Kumar: ‘ప్రైవేటు’తోనే ఉద్యోగావకాశాలు

Janaka Pushpanathan: ఈ రాష్ట్ర‌ ఉన్నత విద్యామండలి కృషి భేష్‌

Published date : 10 Feb 2022 06:43PM

Photo Stories