Skip to main content

KTR News : తెలంగాణ విద్యాశాఖ మంత్రిని ఇంకెప్పుడు నియమిస్తారు..? 1,864 స్కూళ్లను మూసివేత‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చి దాదాపు 8 నెల‌లు దాటింది. ఇంకా తెలంగాణ‌కు విద్యాశాఖ మంత్రిని నియ‌మించ‌లేద‌ని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మండిపడ్డారు.
KTR  KTR addressing concerns about education minister in Telangana BRS working president KTR discusses education issues in Telangana

అలాగే ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిందన‌న్నారు. స్కూల్స్‌లో విద్యార్థులు లేరని 1,864 స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తోందన్నారు. 

➤☛ Schools Holiday Due To Heavy Rains: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. సీఎస్‌ కీలక ఆదేశాలు

టీచర్ల నియామకంలోనూ..
పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే యత్నం జరుగుతుందన్నారు. టీచర్ల నియామకం, వసతుల కల్పన, నాణ్యమైన ఆహారం అందించటంలో విఫలమైందని విమర్శించారు. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

School Holidays: దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్‌!

Published date : 02 Sep 2024 08:57AM

Photo Stories