Skip to main content

Degree Admissions: డిగ్రీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేది ఇదే

ఖమ్మం అర్బన్‌: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.
Invitation of applications for admission to degree courses

ఖమ్మంలో మహిళా డిగ్రీ కాలేజీ, కొత్తగూడెంలో పురుషుల డిగ్రీ కాలేజీ ఉండగా, ఆర్‌డీసీ సెట్‌–2024 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ఖమ్మం కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేంసాని వెంకటేశ్వరరావు మార్చి 26న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్‌ 12లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్‌ 28న ప్రవేశపరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: ISO Certification: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజన వసతితో పాటు యూనిఫాం, నోట్‌, టెక్ట్‌స్‌ పుస్తకాలు అందుతాయని తెలిపారు.

వివరాలకు రఘునాథపాలెంలోని ఎన్‌ఎన్‌మూర్తి పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో కొనసాగుతున్న మహిళా గురుకుల డిగ్రీ కళాశాల లేదా 98481 61319, 80194 22103 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Published date : 29 Mar 2024 03:45PM

Photo Stories