Education: విద్యార్థులకు వినూత్న బోధన
మార్చి 29న సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సేవ్ ది చిల్డ్రన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫౌండేషన్, సన్ టీవీ నెట్‌వర్క్ సంస్థలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ.. పిల్లలకు అనుభవాత్మక విద్యను అందించడానికి సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ప్రత్యేక ప్రాజెక్ట్‌లను రూపొందించి రాష్ట్రంలోని 81 మోడల్ స్కూళ్లు, 117 జెడ్పీ హైస్కూళ్లలో స్టెమ్, స్మార్ట్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీటిని ఉపాధ్యాయులు, విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
చదవండి: Tenth Class: ఆ రెండు పేపర్లకే అదనపు సమయం
సమావేశంలో సమగ్ర శిక్షా ఎస్‌ఏపీడీ బి.శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, మోడల్ స్కూల్ సెక్రటరీ కేవీ కృష్ణారెడ్డి, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణ సంచాలకులు కె.రవీంద్రనాథ్‌రెడ్డి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ ముత్యం, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరాజేష్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వినాయక్, సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు ప్రశాంతి బత్తిన, నగేష్ మల్లాడి, రమేష్ దొంత పాల్గొన్నారు.
చదవండి: Suneung Exam: ఒక్క పరీక్ష కోసం ఆ దేశమే మూగబోతుంది... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే