Suneung Exam: ఒక్క పరీక్ష కోసం ఆ దేశమే మూగబోతుంది... ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
చదవండి: ఒక్కో పాఠశాలకు 46 లక్షలు.. దేశవ్యాప్తంగా 9 వేల పాఠశాలలకు మహర్దశ
అనధికార బంద్ వాతావరణం...
ఇండియాలో ఎంసెట్, నీట్, జేఈఈ, ఐసెట్, ఈసెట్ అంటూ రకరకాల పరీక్షలున్నట్లే దక్షిణ కొరియాలో ఒకటే పరీక్ష ఉంటుంది. పన్నెండో తరగతి పాసైన విద్యార్థులు యూనివర్సిటీల్లో చేరడానికి దేశవ్యాప్తంగా ‘సన్‌అంగ్’ అనే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పాసైన వారు మాత్రమే యూనివర్సిటీల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఆ ఒక్క రోజు దక్షిణ కొరియా అంతా మూగబోతుంది. పరీక్ష రాసే విద్యార్థులను తమ దేశ భవిష్యత్తుగా భావిస్తారు కొరియన్లు. దీంతో సాధారణంగా ఆ రోజు దాదాపు అనధికార బంద్ వాతావరణం కనిపిస్తుంది.
చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు... సెలవుల లిస్ట్ ఇదే...
మార్చి నుంచి డిసెంబర్ వరకు...
ద.కొరియాలో విద్యాసంవత్సరం మార్చిలో మొదలై డిసెంబరులో ముగుస్తుంది. నవంబరులో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఒకేరోజు ఎనిమిది గంటలపాటు జరిగే పరీక్షలో కొరియా భాషతో పాటు ఇంగ్లిష్, గణితం, చరిత్ర, సైన్సు తదితర సబ్జెక్టులు ఉంటాయి. పై చదువులు ఏ సబ్జెక్టులో చదవాలనుకుంటారో ఆ సబ్జెక్టులో ప్రధాన పరీక్షను ఎంచుకుంటారు. హైస్కూలుకు వచ్చినప్పటినుంచి స్కూలు ప్రారంభానికి ముందో రెండు గంటలూ, అయిపోయాక మరో నాలుగైదు గంటలూ స్కూల్లోనే ఉండి చదువుకుంటారు. పాఠశాల యాజమాన్యాలు కూడా తగిన వసతులు కల్పిస్తాయి. ఇంట్లో సన్‌అంగ్ పరీక్ష రాసే విద్యార్థి ఉంటే ఆ కుటుంబమంతా పరీక్ష రాస్తున్నట్లే భావిస్తారు.
చదవండి: ఏపీలో మూడు ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్
దేశమంతా సహకారం...
సన్అంగ్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆ దేశమంతా సహకారం అందిస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కోర్టులూ, బ్యాంకులూ, స్టాక్‌మార్కెట్‌తో సహా కార్యాలయాలన్నిటినీ కొద్దిపాటి సిబ్బందితో ఆలస్యంగా ప్రారంభించి త్వరగా మూసేస్తారు. భాషకి సంబంధించిన పరీక్ష విని రాయాల్సింది ఉంటుంది. దీంతో వారి ఏకాగ్రతకి భంగం కలగకుండా విమానాల రాకపోకల్ని నిలిపేస్తారు. పరీక్ష రాసేందుకు పిల్లలు వెళ్తున్నట్లు కనిపిస్తే వారిని కార్లలో పరీక్షా కేంద్రానికి చేర్చడం పోలీసుల బాధ్యత. పిల్లలు టెన్షన్ లేకుండా పరీక్షకు వెళ్లాలన్నదే అందరి ఆశయం. ఐదారు లక్షలమంది రాసే పరీక్ష కోసం ఆ దేశమంతా ఇలాంటి సహకారం అందించడం అంటే నిజంగా గొప్ప విషేశమే కదా...!