Skip to main content

AP News: ఏపీలో మూడు ప్రాంతాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్‌... ఎక్క‌డెక్క‌డంటే

సాక్షి,ఎడ్యుకేష‌న్: విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు శ్రీస్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్‌ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తా­మని వారు తెలియజేయగా.. ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ వారికి హామీ ఇచ్చారు.
సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు
సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు

చ‌ద‌వండి: ప్ర‌వేశాల‌కు వేళాయే.... కేంద్రీయ విద్యాల‌యాల‌కు ఇలా అప్లై చేసుకోండి

52కు పైగా విద్యాసంస్థలు....
స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు సీఎం జ‌గ‌న్‌ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కాగా, వైఎస్సార్‌ హయాంలో తెలంగాణలోని మొయినాబాద్‌లో గురు­కుల్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమి­ని కేటాయించేందుకు సన్నాహాలు జరిగాయని.. కానీ ఆయన అకాల మరణంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎంకు ప్రతినిధుల బృం­దం వివరించింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, న్యూఢిల్లీతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలలో 52కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయని తెలియజేసింది.

చ‌ద‌వండి: భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌... న‌డ‌క భ‌క్తుల‌కు ఇక‌పై టోకెన్ల జారీ.. ఎప్ప‌టినుంచంటే...

Published date : 28 Mar 2023 05:38PM

Photo Stories