Skip to main content

TTD Information: భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌... న‌డ‌క భ‌క్తుల‌కు ఇక‌పై టోకెన్ల జారీ.. ఎప్ప‌టినుంచంటే...

తిరుమ‌ల‌కు వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. క‌రోనా నేప‌థ్యంలో న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు దివ్య‌ద‌ర్శ‌న టికెట్ల‌ను గ‌త కొన్నేళ్లుగా టీటీడీ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం కోవిడ్ భ‌యాలు పూర్తిగా తొలిగిపోవ‌డంతో మ‌ళ్లీ ద‌ర్శ‌న టికెట్ల‌ను జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ వివ‌రాలు ఇలా...
Tirumala Tirupati Devastanam
Tirumala Tirupati Devastanam

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నారు. వేసవిలో బ్రేక్‌ సిఫారసు లేఖలను తగ్గిస్తామన్నారు. ముఖ గుర్తింపుతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేస్తున్నామ‌న్నారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు.

చ‌ద‌వండి: ప్ర‌వేశాల‌కు వేళాయే.... కేంద్రీయ విద్యాల‌యాల‌కు ఇలా అప్లై చేసుకోండి

Published date : 27 Mar 2023 06:53PM

Photo Stories