SA 1 Exam: సమ్మెటివ్‌కు సన్నద్ధం
అక్టోబర్ 21 నుంచి 28 వరకు నిర్మాణాత్మక పరీక్షలు(ఎస్‌ఏ–1) జరుగనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇది వరకు ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షలు పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు తయారుచేసుకున్న పరీక్ష పత్రా ల ఆధారంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని గణించారు. కాగా ఈ ఎస్‌ఏ–1 పరీక్షలు ప్రభుత్వ విద్యాశాఖ పరంగా తయారు చేసిన పరీక్షపత్రాల ఆధారంగా పరీక్షలుంటాయి.
- ప్రాథమిక పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు, ఎనిమిది తరగతులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఏడు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.15గంటల వరకు, పదోతరగతి విద్యార్థులకు ఉదయం 9.15గంటల నుంచి మధ్యాహ్నం 12.15వరకు పరీక్షల సమయం ఉంటుంది.
- వచ్చేనెల 2పరీక్ష పత్రాల పరిశీలన, మార్కుల ఫలితాలు, 5న రిజిస్ట్రర్లలో మార్కులు పొందుపర్చడం, 16న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశంలో ఒక్కో విద్యార్థి పరీక్షా ఫలితాలపై చర్చిస్తారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ప్రాథమిక పాఠశాలలు: 770
యూపీఎస్‌లు: 114
ఉన్నత పాఠశాలలు: 176
కేజీబీవీలు: 18
మోడల్ స్కూల్స్: 09
విద్యార్థులు: 1,22,556
షెడ్యూల్ ప్రకారం పూర్తి
ఏటా దసరా పండుగ సెలవులకు ముందుగా ఎస్‌ఏ–1 పరీక్షలు ముగిసేవి. ఈ ఏడాది కొంత మార్పు జరిగింది. ఏదేమైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తిచేసుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు, వాటి ఫలితాలు పూర్తవుతాయి.
– రేణుకాదేవి, డీఈఓ, వికారాబాద్