Skip to main content

Bank Holidays In April: ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు... సెల‌వుల లిస్ట్ ఇదే...

లావాదేవీలు నిత్య‌క‌`త్య‌మ‌య్యాయి. డిటిట‌ల్ బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత చాలావ‌ర‌కు బ్యాంకుల‌కు వెళ్లాల్సిన ప‌ని త‌ప్పింది. అయితే అత్య‌వ‌స‌ర సేవలు, రుణాల మంజూరుకు బ్యాంకుకు తప్ప‌కుండా వెళ్లాల్సిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్‌లో ఏయే రోజులు బ్యాంకులు ప‌నిచేస్తాయో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.
Bank Holidays in April 2023
Bank Holidays in April 2023

ఏప్రిల్‌లో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు ఉన్న నేప‌థ్యంలో దాదాపు స‌గం రోజులు బ్యాంకులు ప‌ని చేయ‌వు. శని, ఆదివారాలతో కలిపి 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ విడుద‌ల చేసిన క్యాలండ‌ర్ మేర‌కు... ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. 
ఒక్కో రాష్ట్రానికి బ‌ట్టి సెల‌వులు....
మహవీర్‌ జయంతి రోజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు లేదు. మరోవైపు సెకండ్‌, ఫోర్త్‌ శనివారాలైన 8, 22వ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. అలాగే ఏప్రిల్‌లో ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇలా మొత్తం క‌లిపి తెలుగు రాష్ట్రాల్లోనే 11 రోజులు బ్యాంకులు పనిచేయబోవు. అలాగే ఇత‌ర రాష్ట్రాల్లోనూ స్థానిక పండుగ‌ల నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయి. ఇలా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. 
సెల‌వుల జాబితా ఇదే....
ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న మిజోరం, చండీగఢ్, మేఘాలయ,  హిమాచల్ ప్రదేశ్ మినహా,  బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 2, 9,16,23,30: ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
ఏప్రిల్ 4 : మహావీర్ జయంతిని పురస్కరించుకుని  వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి 
ఏప్రిల్ 5: బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 7:  గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 8: రెండో శనివారం, అలాగే 22 నాలుగో శనివారం
ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 15: వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 18: షాబ్ ఇ బకర్ కారణంగా జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. 
ఏప్రిల్ 21:  రంజాన్ ఈద్( ఈద్ ఉల్ ఫితర్‌)  అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.

Published date : 30 Mar 2023 11:53AM

Photo Stories