Tenth Class: ఆ రెండు పేపర్లకే అదనపు సమయం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 3 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల సమయ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.
ఈ మేరకు ఆమె మార్చి 29న ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్, మొదటి భాష (కాంపొజిట్ పేపర్ల) పరీక్షలు 3.20 గంటలు ఉంటాయని, ఈ రెండు మినహా మిగతా పేపర్లన్నీ 3 గంటల పాటు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ రెండు పేపర్లను పార్ట్ –1, పార్ట్ –2 గా నిర్వహించనుండటంతో అదనపు సమయాన్ని కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే నిర్వహిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఆ రెండు పేపర్ల సమయంలోనే మార్పులు
- సైన్స్, కాంపొజిట్ పేపర్లను మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.
- కాంపొజిట్ తెలుగు, ఉర్దూ పేపర్ల పార్ట్ –1ను 60 మార్కులకు నిర్వహిస్తారని, ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
- పార్ట్ –బీ (ఆబ్జెక్టివ్ టైపు) పేపర్‌ను ఉదయం 11 గంటలకు ఇస్తారని, ఉదయం 11.30 గంటలతో ఈ పేపర్‌ను ముగించాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత పార్ట్ – 2 పేపర్ ఇస్తారని, ఈ పరీక్షను ఉదయం 11. 50 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
- సైన్స్ పేపర్‌లో మొదట పార్ట్ –1 (భౌతికశాస్త్రం) పేపర్‌ను ఇస్తారు. ఈ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. పార్ట్ –బీ పేపర్ (ఆబ్జెక్టివ్ టైపు)ను ఉదయం 10:45 గంటలకు ఇస్తారు. 11 గంటలకు ముగించాలని తెలిపారు.
- పార్ట్ –2 (జీవశాస్త్రం) పేపర్‌ను ఉదయం 11:20 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 50 గంటల వరకు, పార్ట్ –బీ పేపర్ (ఆబ్జెక్టివ్ టైపు)ను మధ్యాహ్నం 12.35 గంటల ఇవ్వనుండగా, మధ్యాహ్నం 12.50 గంటల లోపు ముగించాలని వివరించారు. ఈ రెండు పేపర్లకు వేర్వేరు ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు ఇవ్వాల్సి ఉండటం, వీటిని మార్చుకునేందుకు గడువునివ్వడంలో భాగంగా అదనపు సమయాన్ని కేటాయించినట్టు పేర్కొన్నారు.
Published date : 30 Mar 2023 01:23PM