Medical Seats: రాష్ట్రంలో పెరిగిన మెడికల్ పీజీ సీట్లు
సూర్యాపేట మెడికల్ కాలేజీకి 25, సిద్దిపేట కాలేజీకి 80, నల్గొండ కాలేజీకి 30, నిజామాబాద్ కాలేజీకి 16, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 32, మహబూబ్‌నగర్ కాలేజీకి 10, కాకతీయ కాలేజీకి 3, ఆదిలాబాద్ రిమ్స్‌కు 22, గాంధీ మెడికల్ కాలేజీకి 14 సీట్లను కొత్త గా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
చదవండి: National Medical Commission: సంచలన నిర్ణయం
మెడికల్ కాలేజీకి కేంద్రం అనుమతి
కొత్తగూడెంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ Medical Collegeకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు National Medical Commission (NMC) ఆగస్టు 24న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. 2022–23లో కొత్తగా జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఇటీవలే జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చింది.
మహబూబాబాద్, మంచిర్యాల, రామగుండం మెడికల్ కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది. కొత్తగూడెం కాలేజీకి అనుమతి రావడం పట్ల తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: MBBS: సీట్లలో రాష్ట్రానికి ఏడో స్థానం
కాలేజీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా CCTV Camerasను అమర్చాలని National Medical Commission (NMC) ఆదేశించింది.
ఆసుపత్రి, మెడికల్ కాలేజీ ప్రధాన ద్వారం వద్ద ఒకటి, రోగుల రిజిస్ట్రేషన్ వద్ద 2, ఓపీ సేవల వద్ద 5, ప్రి అనస్థీషియా ప్రదేశంలో 2, అధ్యాపకులు కూర్చునే చోట, హాజరు పట్టికలో సంతకం చేసే చోట 2, అన్ని లెక్చర్ హాల్స్‌లో 5, అనాటమీ ల్యాబ్‌లో 1, ఫిజియాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లో 2, పాథో అండ్ మైక్రోబయాలజీ ల్యాబుల్లో 2, ఫార్మకాలజీ ల్యాబ్‌లో 1, రోగుల సహాయకులు వేచి ఉండే ప్రదేశంలో 1, అత్యవసర విభాగంలో 1 చొప్పున మొత్తంగా 25 CCTV Camerasను ఏర్పాటు చేయాలని సూచించింది.