Skip to main content

విద్యా ‘బుద్ధి’ లేని వర్సిటీలు

సాక్షి, అమరావతి: దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో అధికశాతం నాసిరకమైనవేనని తేలింది.
Higher Learning Universities
విద్యా ‘బుద్ధి’ లేని వర్సిటీలు

దేశంలో 1,113 విశ్వవిద్యాలయాలు ఉండగా, వీటిలో 695 వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు లేవంటూ వాటికి గుర్తింపునివ్వడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ అక్రిడిటేషన్‌ అండ్‌ అసెస్‌మెంటు కౌన్సిల్‌ (న్యాక్‌) నిరాకరించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు నిబంధనల మేరకు బోధన, బోధనేతర సిబ్బందిని, మౌలిక సదుపాయాలను కలిగి ఉండి, ఉన్నత ప్రమాణాలను పాటిస్తుంటే వాటికి న్యాక్‌ గుర్తింపు లభిస్తుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వీటికి నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకులను కూడా ఇస్తుంది. ఈ విద్యా సంస్థలకు కేంద్రం ప్రోత్సాహకాలు, మంచి ర్యాంకులు పొందిన వాటికి యూజీసీ ద్వారా భారీగా నిధులు కూడా ఇస్తుంది.

చదవండి: Jobs: ఈ కోర్సుల‌కు పిచ్చ డిమాండ్‌... ఫ్రెష‌ర్ల‌కే ల‌క్ష‌ల్లో ప్యాకేజీ

వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను అంచనా వేయడానికి ఏటా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో సర్వే కూడా నిర్వహిస్తుంది. ఇందుకు ఆలిండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ – ఐష్‌) పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌లో అన్ని ఉన్నత విద్యా సంస్థలు వాటి వివరాలను నమోదు చేయాలి. అలా చేయని సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వదు. అనుమతులు కూడా రద్దు చేస్తుంది. 2020–21 ఏఐఎస్‌హెచ్‌ఈ నివేదిక ప్రకారం దేశంలోని వర్సిటీల్లో 418కి మాత్రమే న్యాక్‌ గుర్తింపు ఉంది. అలాగే 43,796 కాలేజీల్లో 9,062 కళాశాలలకు మాత్రమే న్యాక్‌ అక్రిడిటేషన్‌ ఉన్నట్లు కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. అంటే 34,734 కాలేజీలు నాణ్యత లేనివని తేలింది. 

చదవండి: High Court: తెలుగుభాషలోనూ ఈ ప్రశ్నపత్రం

రాష్ట్రంలో న్యాక్‌ గుర్తింపు తప్పనిసరి 

రాష్ట్రంలో అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఉత్తమ ప్రమాణాలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్, ఏ ప్లస్, ఏ కేటగిరీల గుర్తింపు ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దిశగా మార్గనిర్దేశం చేశారు. విద్యా సంస్థలకు మూడేళ్లు గడువు ఇచ్చి ఆ మేరకు ప్రమాణాలు పాటించాలని నిర్దేశించారు. ప్రమాణాలు పెంపొందించుకోలేని వాటికి అనుమతులు, ప్రవేశాలు రద్దు చేయాలని నిబంధన విధించారు. ప్రమాణాలను అందుకొనేందుకు విద్యా సంస్థలకు ఉన్నత విద్యామండలి తగిన సహకారాన్ని అందిస్తుంది.

చదవండి: VITopia 2023: సోషల్ మీడియా వలన ఉపయోగమా... నష్టమా? స్టూడెంట్స్ ఏమంటున్నారంటే

Published date : 23 Mar 2023 03:41PM

Photo Stories