Skip to main content

High Court: తెలుగుభాషలోనూ ఈ ప్రశ్నపత్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్షల్లో రెండోపేపర్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు తెలుగుభాషలోనూ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది.
High Court
తెలుగుభాషలోనూ ఈ ప్రశ్నపత్రం

ఈ మేరకు మార్చి 20న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పరీక్ష విధానాన్ని మార్చే అధికారం కమిషన్‌కు లేదని స్పష్టం చేసింది. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల నియామక పరీక్షల్లో పేపర్‌–2 ప్రశ్నపత్రాన్ని తెలుగులో ఇవ్వడంలేదని పేర్కొంటూ ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలానికి చెందిన విజయ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. టీఎస్పీఎస్సీ నిర్ణ యం కారణంగా తెలుగు మాధ్యమ అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కె.శరత్‌ మార్చి 20న విచారణ చేపట్టారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పిటిషనర్‌ తరఫు న్యాయవాది బూర రమేశ్‌ వాదనలు వినిపిస్తూ 2004, 2008 నోటిఫికేషన్లలో రెండు భాష ల్లోనూ ప్రశ్నపత్రం ఇచ్చారని, కాలేజీ ల్లో మాధ్యమం పరంగా ఖాళీలను వెల్లడించలేదన్నారు. మొత్తం 16 సబ్జెక్టులకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వడం కష్టసాధ్యమైన పని అని కమిషన్‌ తరపు న్యాయ వాది ఎం.రాంగోపాల్‌రావు వెల్లడించారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. గతంలో రెండు భాష ల్లో పరీక్షలు నిర్వ హించి, ఇప్పుడు సాధ్యంకాదనడాన్ని తప్పుబట్టారు. అభ్యర్థుల ఎంపికకు ఎక్కు వ మార్కులున్న పేపర్‌ 2 ప్రశ్నప్రతం ప్రధానం కానుందన్నారు. ఈ నేపథ్యంలో దాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు.

Published date : 21 Mar 2023 03:44PM

Photo Stories