Skip to main content

Schools Reopening: జూన్ 17 వరకు ఒంటి పూటే

Half Day Schools from 12th to 17th June in AP

సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు  తరగతులు నిర్వహించనున్నారు.

ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు  పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
 

Published date : 12 Jun 2023 05:32PM

Photo Stories