విద్యా సంస్థలకు జీఎస్టీ వర్తిస్తుందా?

తదుపరి ఉత్తర్వులు వెల్లడించే వరకు సదరు కాలేజీ నుంచి GST వసూలు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు ప్రైవేట్ విద్యా సంస్థలకు జీఎస్టీ వర్తిస్తుందో.. లేదో.. చెప్పాలని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ, జీఎస్టీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పన్ను వసూలు చేసేలా కాళోజీ వర్సిటీ 2022 ఫ్రిబవరి 26న నోటీసులు జారీ చేసింది. ఆగష్టు 24న మరోసారి నోటీసులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సహా 10 కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సెప్టెంబర్ 5న విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున గడ్డం శ్రీనివాస్, కాళోజీ వర్సిటీ తరఫున ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పిటిషనర్ కాలేజీలను పన్ను వసూలుకు సంబంధించి ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 22 నవంబర్‌కు వాయిదా వేసింది.
చదవండి: