National Flag: జాతీయ పతాక విక్రయాలపై జీఎస్టీ మినహాయింపు
భారత జాతీయ పతాక విక్రయాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. మెషీన్‌తో రూపొందించినా, పాలిస్టర్‌తో తయారు చేసినా కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. పట్టు, ఉన్ని లేదా ఖాదీతో చేతితో తయారు చేసే జాతీయ పతాకాలకు ఇప్పటికే జీఎస్టీ మినహాయింపు ఉంది. భారత జాతీయ పతాక నిబంధనలు 2002లో సవరణల తర్వాత పాలిస్టర్ లేదా మెషీన్ తయారీ పతాకాలకు కూడా జీఎస్టీ మినహాయింపు లభిస్తుందని రెవెన్యూ విభాగం స్పష్టం చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ స్పష్టత ఇచ్చింది.
చదవండి: GK National Quiz: దేశంలో మొట్టమొదటి తేనె గ్రామంగా (honey village) అవతరించినది?
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP