కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 14-20 May, 2022)
1. 'భారత్ ట్యాప్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
ఎ. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ
బి. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సి. జలశక్తి మంత్రిత్వ శాఖ
డి. MSME మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
2. 'PM-WANI పథకం' దేనిని సూచిస్తుంది?
ఎ. ప్రధానమంత్రి Wi-Fi యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పథకం
బి. ప్రధాన మంత్రి వైర్లెస్ యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పథకం
సి. ప్రధాన మంత్రి Wi-Fi యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్మిషన్ పథకం
డి. ప్రైమ్ మూవబుల్ Wi-Fi యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పథకం
- View Answer
- Answer: ఎ
3. 'నాలుగు విత్తనాల పథకం' ('Four-Sowing Scheme') ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. రాజస్థాన్
బి. పంజాబ్
సి. హరియాణ
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
4. దేశంలో మొట్టమొదటి తేనె గ్రామంగా (honey village) అవతరించినది?
ఎ. మన్ఘర్ గ్రామం, మహారాష్ట్ర
బి. అరకు గ్రామం, ఆంధ్ర ప్రదేశ్
సి. మాండ్య గ్రామం, కర్ణాటక
డి. తిర్సూర్ గ్రామం, కేరళ
- View Answer
- Answer: ఎ
5. పేద విద్యార్థుల కోసం ఏ రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది?
ఎ. మణిపూర్
బి. అసోం
సి. తెలంగాణ
డి. బిహార్
- View Answer
- Answer: ఎ
6. నేషనల్ డేటా & అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ (NDAP)ను ప్రారంభించిన సంస్థ?
ఎ. నీతి ఆయోగ్
బి. C-DAC
సి. NASSCOM
డి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
7. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడే గతిశక్తి సంచార్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
ఎ. అమిత్ షా
బి. పీయూష్ గోయల్
సి. గిరిరాజ్ సింగ్
డి. అశ్విని వైష్ణవ్
- View Answer
- Answer: డి
8. 'రూరల్ ట్రైబల్ టెక్నికల్ ట్రైనింగ్' ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. గాంధీ నగర్
బి. పూణే
సి. భోపాల్
డి. వారణాసి
- View Answer
- Answer: సి
9. ఏ రాష్ట్రంలో నిర్వహించిన 'ఉత్కర్ష్ సమారోహ్'లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు?
ఎ. గుజరాత్
బి. హరియాణ
సి. పంజాబ్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: ఎ
10. భారత సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 31 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత 18 మే 2022న విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదీ పేరు?
ఎ. రాబర్ట్ పయస్
బి. AG పెరరివాలన్
సి. రవిచంద్రన్
డి. జయకుమార్
- View Answer
- Answer: బి
11. అర్బన్ ఫార్మింగ్ పాలసీని ఏ రాష్ట్ర/UT ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తోంది?
ఎ. గుజరాత్
బి. మధ్యప్రదేశ్
సి. రాజస్థాన్
డి. ఢిల్లీ
- View Answer
- Answer: డి