జనవరి 1 నుంచి తగ్గేవి.. పెరిగే వస్తువులు ఇవే..!
జీఎస్టీలో మార్పులు, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌లపై ప్రభావితం చేయనున్నాయి. కానీ ఈ సేవలను పొందే కస్టమర్లను ప్రభావితం చేయవు. ఆయా వ్యాపారులను మాత్రమే కొత్త జీఎస్‌టీ ప్రభావితం చేయనున్నాయి. కాగా పలు కన్య్సూమర్ గూడ్స్‌పై విధించే కొత్త జీఎస్‌టీ మాత్రం సామాన్యులపై పడే అవకాశం ఉంది.
2022 జనవరి 1 నుంచి ధరలు పెరిగే జాబితా ఇలా..!
1. బట్టలు, పాదరక్షలు :
దుస్తులు, పాదరక్షలు వంటి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 5 నుంచి 12 శాతం వరకు జీఎస్‌టీ స్లాబ్ రేట్లను పెంచింది. ఈ వస్తువులు జనవరి 1, 2022 నుంచి మరింత ఖరీదైనవిగా కానున్నాయి. రూ. 1,000 వరకు ఉన్న వస్తువులపై జీఎస్‌టీ గతంలో 5-12శాతంకి పెంచారు. వస్త్రాలు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, అలాగే టేబుల్‌క్లాత్‌లు లేదా సర్వియెట్‌లు వంటి ఉపకరణాలతో సహా వస్త్రాలపై జీఎస్‌టీ రేటు కూడా పెరిగింది.
పాదరక్షలపై ప్రత్యక్ష పన్నును కూడా 5% నుంచి 12%కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నవంబర్ 18, 2021న మార్పులను తెలియజేసింది. బట్టలు, పాదరక్షల ధరల పెంపు చర్యను వివిధ వ్యాపార సంఘాలు వ్యతిరేకించాయి. ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్న సమయంలో రేట్ల పెంపుపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
2. క్యాబ్ అండ్ ఆటో రైడ్స్ :
ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై 5% జీఎస్‌టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్‌టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.
3. స్విగ్గీ అండ్ జోమాటో :
జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు అందించే సేవలపై 5 శాతం జీఎస్‌టీ విధించనున్నట్లు తెలిపారు. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధించనున్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది.
జనవరి 1 నుంచి తగ్గే ధరల లిస్ట్..!
1. క్యాన్సర్ మందులు
గతంలో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ మందులపై 18 శాతం జీఎస్‌టీను రేట్‌ను విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్‌టీ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో క్యాన్సర్ మందులు తగ్గే అవకాశం ఉంది.
2. ఫోర్టిఫైడ్ రైస్(బలవర్థకమైన బియ్యం)
ఫోర్టిఫైడ్ రైస్‌పై కేంద్రం కొత్త జీఎస్‌టీ రేట్లను ప్రతిపాదించింది. వీటిపై 18 శాతం నుంచి 5 శాతం జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
3. బయోడీజిల్
బయోడీజిల్ అనేది కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు లేదా రీసైకిల్ చేసిన రెస్టారెంట్ గ్రీజు నుంచి తయారు చేసిన పునరుత్పాదక ఇ, బయోడిగ్రేడబుల్ ఇంధనం. వీటిపై కేంద్రం గతంలో 18 శాతం మేర జీఎస్‌టీను వసూలు చేసేది. 2022 జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్టీను కేంద్రం వసూలు చేయనుంది.