Skip to main content

Sai Kishore: జీఎస్టీ అడ్వాన్స్‌ రూలింగ్‌ అథారిటీ సభ్యుడిగా నియమితులైన సాయి కిశోర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలోని జీఎస్టీ అడ్వాన్స్‌ రూలింగ్‌ అథారిటీకి కొత్త సభ్యుడిని నియమించింది.
Sai Kishore as a member of GST Advance Ruling Authority

సాయి కిశోర్‌ను ఈ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న కాశీ విశ్వేశ్వరరావు స్థానంలో సాయి కిశోర్‌ను నియమించారు.

ఈ మార్పుకు కారణం ఇదే..
జీఎస్టీ అక్రమాలు: జీఎస్టీ వసూళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని ఈ శాఖ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాశీ విశ్వేశ్వరరావుపై ఆరోపణలు: ఈ అక్రమాల్లో కాశీ విశ్వేశ్వరరావు ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనను అథారిటీ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

ఏదైనా సంస్థ లేదా కంపెనీ జీఎస్టీ చెల్లింపులో లోపాలున్నట్లు భావిస్తే ఈ అథారిటీకి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తుంది.

Anurag Garg: ఎన్‌సీబీ డీజీగా నియ‌మితులైన‌ అనురాగ్‌ గార్గ్‌

Published date : 26 Sep 2024 10:04AM

Photo Stories