Skip to main content

‘పేట’కు బీసీ డిగ్రీ కళాశాల మంజూరు

నారాయణపేట రూరల్‌: జిల్లాకు మహాత్మా జ్యోతిబాఫూలే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Grant of BC degree college to Peta
‘పేట’కు బీసీ డిగ్రీ కళాశాల మంజూరు

ఈ మేరకు జూన్ 23న‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వెంకటేశం విడుదల చేసిన జీఓలో 17 జిల్లాల్లో నారాయణపేటకు స్థానం దక్కింది. ఇదిలాఉండగా, ఈ కళాశాలను జిల్లాలో కొనసాగిస్తారా లేక జిల్లాకు మంజూరై మోయినాబాద్‌లో కొనసాగుతున్న జ్యోతిబాఫూలే ఇంటర్‌ కళాశాలలోనే నడిపిస్తారా అనే సందేహం కలుగుతుంది. ప్రస్తుతానికి జిల్లాలో ఏడు డిగ్రీ కళాశాలు ఉండగా నారాయణపేట, ధన్వాడ, మక్తల్‌లో ఉండగా మరో నాలుగు నారాయణపేట, మక్తల్‌, మరికల్‌, కోస్గిలలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జ్యోతిబాఫూలే కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి మొదలు కానుంది.

చదవండి:

Degree: యూజీ ఆనర్స్‌.. ఇక జాబ్‌ ఈజీ

TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కార‌ణం ఇదే

Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ

Published date : 24 Jun 2023 05:57PM

Photo Stories