Skip to main content

SV: యూనివర్సిటీ స్నాతకోత్సవం

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ 58, 59, 60, 61, 62వ స్నాతకోత్సవాలు జూన్‌ 23న ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రాజారెడ్డి జూన్‌ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
SVU
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్నాతకోత్సవం

ఇన్‌పర్సన్‌ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకున్న PhD, M.Phil, PG, Degree పూర్తిచేసిన విద్యార్థులు స్నాతకోత్సవం నాడు వారి డిగ్రీలను నేరుగా పొందొచ్చని తెలిపారు. ఇన్‌ఆప్సెన్సియా విభాగం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి డిగ్రీలను స్నాతకోత్సవం తర్వాత పంపుతామని పేర్కొన్నారు. ప్రైవేటు, దూరవిద్య ద్వారా పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లను దరఖాస్తులో సూచించిన చిరునామాకు తపాలా ద్వారా పంపుతామని పేర్కొన్నారు.

చదవండి: 

Published date : 09 Jun 2022 01:26PM

Photo Stories