Skip to main content

ఎస్వీయూ శాస్త్రవేత్తలు కనుగొన్న మొక్క పేరు?

Edu news

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు శివరామకృష్ణ, యుగంధర్, బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన కేటగిరీ–ఈ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌జీ సింగ్‌.... ‘‘క్రోటాలేరియా లామెల్లిఫార్మిస్‌’’ అనే నూతన మొక్కను కనుగొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా తూర్పు కనుమల ప్రాంతంలోని చిత్తూరు జిల్లా కైలాస కోన, పూడి ప్రాంతాల్లో ఈ మొక్కను గుర్తించారు. ఈ మొక్కపై విస్తృత పరిశోధనలు చేయగా ఈ మొక్క ఎర్ర నేలల్లో పెరుగుతుందని, గడ్డిలో కలిసి ఉంటుందని తేలింది. 10 సెం.మీ ఎత్తు పెరుగుతుందని వెల్లడైంది.

క్విక్రివ్యూ :
ఏమిటి : క్రోటాలేరియా లామెల్లిఫార్మిస్‌ అనే నూతన మొక్కను కనుగొన్న శాస్త్రవేత్తలు
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : శివరామకృష్ణ, యుగంధర్‌(శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ), డాక్టర్‌ లాల్‌జీ సింగ్‌(బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)
ఎక్కడ : కైలాస కోన, పూడి ప్రాంతాలు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

Published date : 18 Mar 2021 05:59PM

Photo Stories