‘విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు బంగారు భవిత’
Sakshi Education
సాక్షి, అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సీఎం జగన్ బంగారు భవిష్యత్ అందిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.
‘విదేశీ విద్యా దీవెనతో పేద విద్యార్థులకు బంగారు భవిత’
ఈ మేరకు ఫిబ్రవరి 5న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అపార ప్రతిభ ఉండి పేదరికం కారణంగా విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించలేకపోతున్నవారికి ఈ పథకం సువర్ణ అవకాశమన్నారు. అర్హతే ప్రమాణికంగా కులమతాలకు అతీతంగా ఈ పథకాన్ని అమలు చేయడం గొప్ప విషయమన్నారు.