KTR: ఒక్కో పాఠశాలకు రూ. 50 వేలు
Sakshi Education
క్రీడలను ప్రోత్సహించేందుకు వీలుగా క్రీడా పరికరాల కొనుగోలుకు తన నియోజకవర్గ నిధుల నుంచి ఒక్కో పాఠశాలకు రూ. 50 వేల చొప్పున విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా చేస్తే క్రీడా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే వాటిని కూడా అభివృద్ధి సూచించారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యరద్శి రామకృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Published date : 02 May 2022 02:54PM