కామారెడ్డి అర్బన్: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని విద్యార్థులకు చేరవేయడానికి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు యువజన, క్రీడల జిల్లా అధికారి వై దామోదర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఫిట్ ఇండియా’ క్విజ్ పోటీలు
ఫిట్ ఇండియా క్విజ్ విజేతలకు రూ.3కోట్లకు పైగా విలువైన బహుమతులు ఇస్తారని వివరించారు. ఇంగ్లిష్, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో నిర్వహించే ఈ క్విజ్‌లో పాల్గొనే వారు ప్రిలిమినరీ రౌండ్ కోసం అక్టోబర్ 31లోగా వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.