Aluvala Saiteja: Prime Ministerతో డిబేట్‌లో పాల్గొననున్న సుద్దాల విద్యార్థి
Sakshi Education
కోనరావుపేట (వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి అలువాల సాయితేజ.. ప్రధాని నరేంద్రమోదీతో జరిగే డిబేట్‌కు ఎంపికయ్యాడు.
పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ప్రధాని ‘పరీక్ష పే చర్చ’అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పాల్గొని ప్రశ్నలు అడిగేందుకు ముందుగా నిర్వహించిన అర్హత పరీక్షలో సాయితేజ విజయం సాధించారు.
ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 10 వేల మంది విద్యార్థులకు నిర్వహించారు. జనవరి 25 నుంచి 29 వరకు తమ అతిథిగా ఉండాల్సిందిగా కేంద్ర విద్యామంత్రిత్వశాఖ ఆహ్వానం మేరకు ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు గంగాధర్‌తో కలిసి వెళ్లాడు.
Published date : 28 Jan 2025 01:08PM