Indian Navy: ఐఎన్‌ఎస్ సూరత్, నీలగిరి, వాగ్‌షీర్ జాతికి అంకితం చేసిన ప్రధాని
ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు.
ప్రధాని హర్షం వ్యక్తం చేస్తూ.. "భారత్ ఇప్పుడు తిరుగులేని సాగరశక్తిగా అవతరించిందని", "మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని" అన్నారు.
భారతదేశం.. సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి ముప్పుల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆయన ఆకాంక్షించారు.
"మూడు యుద్ధ నౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం," అని పేర్కొని, నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. గత పదేళ్లలో 40 నౌకలు భారత సైన్యానికి అందుబాటులోకి వచ్చాయని, వాటిలో 39 నౌకలు భారత్‌లోనే తయారైందని వెల్లడించారు.
ప్రధాని ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో.. నావికా దళానికి దేశీయ చిహ్నాలను రూపొందించుకున్నామని తెలిపారు. అలాగే, 1.5 లక్షల కోట్ల రూపాయలతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
సముద్రయాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఇది 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్ర పరిశోధన ప్రాజెక్టు, ఇది ఇప్పుడు ఊపందుకున్నట్లు చెప్పారు.
PM Modi: వికసిత్ భారత్‌కు యువతే యజమానులన్న మోదీ
ఐఎన్‌ఎస్ నీలగిరి
- ప్రాజెక్ట్ 17ఏ స్టెల్త్ ఫ్రి గేట్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.
- శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టె క్నాలజీ దీని సొంతం.
- గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్ టెక్నాలజీ ఉంది.
- ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి.
- ఐఎన్‌ఎస్ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.
- ఎంహెచ్–60ఆర్ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.
ఐఎన్‌ఎస్ సూరత్
- ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక.
- ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక.
- అత్యాధునిక ఆయుధ, సెన్సర్ వ్యవస్థలు, అధునాతన నెట్‌వర్క్ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం.
- దీన్ని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది.
- 80% దేశీయంగా తయారవడం విశేషం.
PM Modi in AP: ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్
- ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో ఆరో జలాంతర్గామి.
- దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలుపంచుకుంది.
- యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు.
- నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది.
- అత్యాధునిక ఎయిర్–ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం.
- డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి.
- దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైళ్లు, వైర్ గైడెడ్ టార్పెడోలను మోహరించారు.
- భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు.
National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం