PM Modi: ‘యువత బలమే దేశానికి కలిమి’ అన్న ప్రధాని మోదీ

యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12వ తేదీ ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు.
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు.
Pravasi Bharatiya Divas: ‘భవిష్యత్తు యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే..’ ప్రధాని మోదీ
ప్రభుత్వం, యువత కలసికట్టుగా..
2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది సాధించడం సులభం కాదు, కానీ అందరూ కలసి కృషి చేయాలని మోదీ సూచించారు. యువత దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందన్నారు.
1930లో జరిగిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, అలాగే సింగపూర్ యొక్క అభివృద్ధి గురించి కూడా మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాధించడంలో కృషి చేయడం అత్యంత కీలకమని చెప్పారు.
రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలం అని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేయవచ్చని మోదీ నమ్మకం వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలని యువత సిద్ధం కావాలని సూచించారు.
యువత ఆలోచనలు, దిశానిర్దేశం దేశానికి ఎంతో అవసరమని ప్రధాని చెప్పారు. మన లక్ష్యాలను సాధించడానికి యువతను ప్రోత్సహిస్తూ, వారితో కలిసి ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు.
PM Modi in AP: ఏపీలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ..