Skip to main content

Republic Day: 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు

భార‌త‌దేశవ్యాప్తంగా జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
942 Personnel Awarded Gallantry and Service Medals

ఈ సందర్భంగా దేశంలోని రక్షణ విభాగంలో విశిష్ట సేవలు అందించిన సిబ్బందికి శౌర్య పురస్కారాలు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి 942 మంది రక్షణ సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు.
 
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర భద్రత తదితర విభాగాలకు చెందిన 942 మంది సిబ్బందికి శౌర్య పురస్కారాలు ప్రకటించారు. ఇందులో 95 మంది సైనికులకు శౌర్య పతకం, 101 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పతకం, 746 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి.

95 శౌర్య పురస్కారాలలో అత్యధిక పురస్కారాలను నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో నియమితులైన సైనికులకు అందజేయనున్నారు. వీరిలో నక్సలైట్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన 28 మంది సైనికులు, ఈశాన్య ప్రాంతానికి చెందిన 03 మంది సైనికులు, ఇతర ప్రాంతాలకు చెందిన 36 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 78 మంది పోలీసులు, 17 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు.

Republic Day 2025: 76వ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలు ఇవే.. ఈ ఏడాది థీమ్ ఇదే..

101 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలలో 85 పోలీసు సేవకు, ఐదు అగ్నిమాపక సేవకు, ఏడు పౌర రక్షణ-హోంగార్డ్‌లకు, నాలుగు సంస్కరణల విభాగానికి లభించాయి. 746 మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్‌ఎం)పతకాలలో 634 పోలీసు సేవకు, 37 అగ్నిమాపక సేవకు, 39 సివిల్ డిఫెన్స్-హోం గార్డ్స్‌కు, 36 కరెక్షనల్ సర్వీస్‌కు లభించాయి.

రాష్ట్రాల వారీగా గ్యాలంట్రీ అవార్డుల డేటాను పరిశీలిస్తే ఈ అవార్డులను ఛత్తీస్‌గఢ్‌కు  చెందిన 11 మందికి, ఒడిశాకు చెందిన ఆరుగురికి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మందికి, జమ్ముకశ్మీర్‌కు చెందిన 15 మంది పోలీసు సిబ్బందికి  అందజేయనున్నారు.  

అస్సాం రైఫిల్స్ నుంచి ఒక సైనికునికి, బీఎస్‌ఎఫ్‌ నుంచి ఐదుగురు, సీఆర్‌పీఎఫ్‌ నుండి 19 మంది, ఎస్‌ఎస్‌బీ నుంచి నలుగురికి శౌర్య పురస్కారాలు లభించాయి. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ అగ్నిమాపక విభాగానికి చెందిన 16 మంది అగ్నిమాపక సిబ్బందికి, జమ్ముకశ్మీర్ అగ్నిమాపక విభాగానికి చెందిన ఒక అగ్నిమాపక అధికారికి అందజేయనున్నారు.

Union Budget 2025: యూనియన్ బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు ఇవే..

Published date : 27 Jan 2025 08:47AM

Photo Stories