CPGET: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు
ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మ డి వరంగల్‌జిల్లా కేంద్రంలో 4 , ఖమ్మంలో 5 , ఆదిలాబాద్‌లో 1 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశా రు. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్‌లోనే ఈ ప్రవేశ పరీక్షలు కొనసాగుతాయని సీపీగెట్ కన్వీనర్, ఉస్మాని యా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి జూన్ 29న తెలిపారు. 45 పీజీకోర్సుల్లో ఈ ప్రవేశపరీక్షలు జూన్ 30నుంచి జూలై 10వతేదీ వరకు జరుగుతాయన్నారు. కేయూ పరిధిలో వరంగల్‌లో 7,117మంది, ఖమ్మంలో 5,133మంది, ఆదిలాబా ద్‌లో 1646 మంది మొత్తం.. 13,896 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు.
చదవండి:
TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే
Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?
NCERT: 8వ తరగతి సిలబస్ తగ్గింపు.. తొలగించిన చాప్టర్లు ఇవే
మూడు సెషన్లలో ప్రవేశపరీక్షలు జరుగుతాయి. షెడ్యూల్ ప్రకా రం ఆయా రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2. 30గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన పరీక్ష సమయం ప్రకారం ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కన్వీనర్ పాండురంగారెడ్డి కోరారు.