NCCతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి
Sakshi Education
అచ్యుతాపురం(అనకాపల్లి): ఎన్‌సీసీ క్యాడెట్‌గా శిక్షణ పొందటం ద్వారా విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, స్వీయరక్షణ, దేశభక్తి అలవడుతుందని ఆంధ్రా, తెలంగాణ ఎన్‌సీసీ నౌసైనిక్ ఇంటర్ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమాండర్ వీఎం రెడ్డి అన్నారు.
అచ్యుతాపురం మండలంలోని ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆంధ్ర, తెలంగాణ నౌసైనిక్ ఎన్‌సీసీ షిప్ బిల్డింగ్, ఫైరింగ్, సెయిలింగ్ క్యాంప్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. 1948 నుంచి ద్వితీయ శ్రేణి రక్షణ రంగం కోసం ఎన్‌సీసీ నౌసైనిక్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంప్‌లో ప్రతిభ కనబరచిన వారిని నౌసైనిక్, రిపబ్లిక్ డే క్యాంప్‌లకు ఎంపిక చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన 300 మంది క్యాడెట్లు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారు.
చదవండి:
Andhra Pradesh: ఎన్‌సీసీ కెడెట్స్ కు శుభవార్త
Talent of NCC cadets: ఆర్మీ అటాచ్‌మెంట్‌లో ఎన్‌సీసీ కెడెట్ల ప్రతిభ
Published date : 30 Aug 2023 02:55PM