Skip to main content

ఆర్మీ అటాచ్‌మెంట్‌లో ఎన్‌సీసీ కెడెట్ల ప్రతిభ

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన ఎన్‌సీసీ కెడెట్లు రాష్ట్రస్థాయి ఆర్మీ అటాచ్‌మెంట్‌ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ కనబర్చారని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మీనర్సయ్య, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్‌ సంజీవ్‌ తెలిపారు.
Talent of NCC cadets in army attachment
ఆర్మీ అటాచ్‌మెంట్‌లో ఎన్‌సీసీ కెడెట్ల ప్రతిభ

 హైదరాబాద్‌ మెహదీపట్నంలో జరిగిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో డ్రిల్‌, ఫిజికల్‌ శిక్షణ, పరిశుభ్రత, రీడింగ్‌, అగ్నివీర్‌ తదితర ప్రత్యేక శిక్షణ తరగతుల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు.

అవినీతి, అక్రమాలను నిర్మూలించండి

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థలోని పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీని సీపీఐ నగర సహయ కార్యదర్శి మద్దెల దినేష్‌, ఎఫ్‌బీఎస్‌ నాయకులు రేణికుంట్ల నరేంద్ర కోరారు. గురువారం గోదావరిఖనిలో అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శానిటేషన్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని, నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేయాలని కోరారు. గోదావరి బ్రిడ్జిపై ఫెన్సింగ్‌ వేయాలని కోరారు.

జీజీహెచ్‌లో స్క్రాప్‌కు ముగిసిన వేలం

కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో గురువారం ఆస్పత్రిలోని స్క్రాప్‌కు అధికారులు వేలం నిర్వహించారు. వేలంలో ఐదుగురు స్క్రాప్‌ కొనుగోలుదారులు పాల్గొనగా.. ఇందులో రూ.80వేలతో ఒకరు వేలం దక్కించుకున్నారు.

బల్దియా సెక్రటరీగా అలీం బాధ్యతల స్వీకరణ

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ సెక్రటరీగా ఎంఏ అలీం గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేసిన అలీంను గత నెలలో ప్రభుత్వం రామగుండంకు బదిలీ చేసింది. విధుల్లో చేరిన అలీం మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపల్‌ ఉద్యోగులకు అండగా నిలవాలి

కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పా రిశుధ్య విభాగంలో పనిచేస్తున్న 569 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు టీఎన్‌జీవోఎస్‌ రాష్ట్ర నాయకులు అండగా నిలవాలని మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు కోరారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎన్‌జీఓఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మమిల్ల రాజేందర్‌, రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ మరం జగదీశ్వర్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌ఎం.హుస్సెన్‌ ము జీబ్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చే యాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని డి మాండ్‌ చేశారు. స్పందించిన టీఎన్‌జీఓఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మమిల్ల రాజేందర్‌ మాట్లాడు తూ మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకపోయామని, దీనిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. మరోసారి చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులు బండారి రవి, రాపోలు శశికుమార్‌, కొంకటి వెంకటేష్‌, బొడ కనకయ్య, వావిలాల అశోక్‌, ఎల్పుల రాయమల్లు, అడేపు శ్రీనివాస్‌, ఎండీ ఈసబ్‌, మంద రాములు, సారయ్య, రాజేందర్‌, రూప, పద్మ, గౌరులక్ష్మి, ముంతాజ్‌ బేగం, నర్సయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Published date : 04 Aug 2023 04:24PM

Photo Stories