Skip to main content

సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్‌

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సేల్స్, టెక్నాలజీ సంబంధ ఉద్యోగులకు భారీగా డిమాండ్‌ నెలకొంది.
Demand for sales and technology employees
సేల్స్, టెక్నాలజీ ఉద్యోగులకు డిమాండ్‌

టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, సైబర్‌సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు.. సేల్స్‌లో కస్టమర్లతో మాట్లాడాల్సిన సిబ్బందికి డిమాండ్‌ నెలకొందని సియెల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది.

చదవండి:

Degree: యూజీ ఆనర్స్‌.. ఇక జాబ్‌ ఈజీ

TAFRC: త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!.. కార‌ణం ఇదే

Disaster Management Authority: ట్రైనీ ఐఏఎస్‌లకు విపత్తుల నిర్వహణపై శిక్షణ

ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 15 వరకు, 11 లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉన్న 60 బీఎఫ్‌ఎస్‌ఐల మానవ వనరుల ఎగ్జిక్యూటివ్‌లతో నిర్వహించిన సర్వే ఆధారంగా సియెల్‌ దీన్ని రూపొందించింది. ఇందుకోసం పోర్టల్స్‌లో 33,774 జాబ్‌ పోస్టింగ్స్‌ను విశ్లేíÙంచింది. నివేదిక ప్రకారం .. కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కొన్ని రకాల ఉద్యోగాలకు డిమాండ్‌ పెరిగింది.

Published date : 24 Jun 2023 06:06PM

Photo Stories