‘డిప్లొమా ఇన్ జర్నలిజం’ తరగతుల ప్రారంభం.. ఇసారి తరగతులు ఇలా..
ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు ఆన్‌లైన్ శిక్షణ తరగతులు మే 1న ప్రారంభమయ్యాయి. మంత్రి చెల్లుబోయిన ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ జర్నలిస్టులు నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు ఇలాంటి కోర్సును మీడియా అకాడమీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
చదవండి: Career Guidance: సరికొత్త కెరీర్ మార్గంగా డిజిటల్ జర్నలిజం..
మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో ప్రతి శనివారం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తిగల వర్కింగ్ జర్నలిస్టులందరూ జూమ్ యాప్ లేదా యూట్యూబ్ ద్వారా వినవచ్చని చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ జి.అనిత పాల్గొన్నారు.