Skip to main content

Journalism: ‘జర్నలిజం’ ఆన్ లైన్ తరగతులు ప్రారంభం

ప్రెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం సర్టిఫికెట్‌ కోర్సు ఆన్ లైన్ తరగతులు సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభమయ్యాయి.
Journalism
‘జర్నలిజం’ ఆన్ లైన్ తరగతులు ప్రారంభం

300 మందికిపైగా జర్నలిస్టులు, విద్యార్థులు వర్చువల్‌ క్లాసులకు హాజరయ్యా రు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఉపయుక్తంగా తొలిసారిగా ప్రెస్‌ అకాడమీ 3 నెలల జర్నలిజం కోర్సును ప్రారంభించిందన్నారు. జర్నలిజంలో మార్పులు, సాంకేతిక వినియోగం తదితర అంశాలపై నిపుణులతో పాఠ్యాంశాలు రూపకల్పన చేసినట్టు వివరించారు. పరీక్షల నిర్వహణ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం చేపడుతుందన్నారు. వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. విక్రమ సింహపురి వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎల్‌.విజయకృష్ణరెడ్డి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం ఫ్రొఫెసర్‌ పి.విజయలక్ష్మి పాల్గొన్నారు.

చదవండి:

జర్నలిజంలో మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు అందిస్తున్న ఏపీ ప్రెస్ అకాడమీ

పాత్రికేయ వృత్తిలో రాణించాలనుకునేవారికి అవ‌కాశం.. ఐఐఎంసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..!

Published date : 21 Sep 2021 01:21PM

Photo Stories