పాత్రికేయ వృత్తిలో రాణించాలనుకునేవారికి అవకాశం.. ఐఐఎంసీకి దరఖాస్తు చేసుకోండిలా..!
జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి బోధన, శిక్షణ, పరిశోధన విభాగాల్లో దేశంలోనే పేరున్న ఇన్‌స్టిట్యూట్ ఐఐఎంసీ. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ద్వారా ఐఐఎంసీ అందించే జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా దే«శ వ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎంసీ కోర్సులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం..
సరైన వేదిక..
సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలను, ప్రజల సమస్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. ఆయా సమస్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా వంటి ప్రసార మాధ్యమాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి.. వాటి పరిష్కారానికి కృషి చేసే వృత్తి జర్నలిజం. ఆ వృత్తిలో భాగస్వాములు అయ్యే వారే జర్నలిస్టులు. ఇంతటి ప్రత్యేకత కలిగిన జర్నలిజం విద్యను అభ్యసించాలని చాలామంది కోరుకుంటారు. అలాంటిæ వారికిS సరైన వేదిక ఐఐఎంసీ. దేశ వ్యాప్తంగా క్యాంపస్‌లను కలిగి.. జర్నలిజంలో ఉత్తమ కోర్సులను అందించే సంస్థగా గుర్తింపు పొందిందింది. న్యూఢిల్లీ ప్రధాన క్యాంపస్‌గా పనిచేసే ఐఐఎంసీకి ఐజ్వాల్ (మిజోరాం), అమరావతి(మహారాష్ట్ర), దెన్‌కనల్(ఒడిషా), జమ్మూ, కొట్టాయం (కేరళ)లో ప్రాంతీయ క్యాంపస్‌లు ఉన్నాయి.
అందించే కోర్సులు..
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రేడియో అండ్ టెలివిజన్ జర్నలిజం
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అడ్వర్‌టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్ జర్నలిజం
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హిందీ జర్నలిజం
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మరాఠి జర్నలిజం
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మలయాళం జర్నలిజం
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఒడియా జర్నలిజం
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఉర్దూ జర్నలిజం.
- ప్రస్తుతం మలయాళం, మరాఠీ, ఒడియా, ఉర్దు కోర్సులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. మిగితా కోర్సులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా గ్రూప్)లో ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
ఎంపిక..
ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వూ్యల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 75 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపిన∙అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వూ్యలకు పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ 15 మార్కులకు,ఇంటర్వూ్య 10మార్కులకు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం..
పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్∙రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి పరీక్ష విధానం ఉంటుంది. మొత్తం 75 మార్కులకు జరిగే రాత పరీక్ష సమయం రెండు గంటలు.
సిలబస్..
- రాత పరీక్షలో జర్నలిజానికి సంబంధించి జనరల్ అవేర్‌నెస్, అప్టిట్యూడ్, మెంటల్ మేకప్, భాషా సామర్థ్యం, అనలిటికల్ అండ్ కాంప్రహెన్షనల్ స్కిల్స్, ఎథిక్స్ అండ్ వాల్యుస్ వంటి అంశాలుంటాయి.
- అడ్వర్‌టైజింగ్ కోర్సుకు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, అప్టిట్యూడ్, మెంటల్ మేకప్, భాషా సామర్థ్యం, అనలిటికల్ అండ్ కాంప్రహెన్షనల్ స్కిల్స్, బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీకాల్, సోషల్ కాన్సియెస్‌నెస్, లేటరల్ థింకింగ్ కెపాబిలిటీస్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- రాత పరీక్షలో సమకాలీనంగా ప్రాధాన్యం ఉన్న అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. జనరల్ అవేర్‌నెస్, సోషల్ పొలిటికల్ డైనమిక్స్, చరిత్ర, రాజ్యాంగ అధికరణలు, దేశంలో విద్య, ఆరోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, వృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, దేశంపై ప్రభావం వంటి వాటిపై దృష్టిసారించాలి. ఎక్కువగా భాషా సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి.
- ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.1,000, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 27.07.2020
- పరీక్ష తేదీ: 04.08.2020
- రాత పరీక్ష ఫలితాల వెల్లడి: 14.08.2020
- ఇంటర్వూలు: 20, 21 ఆగస్టు 2020
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.iimc.ac.in