Skip to main content

Telugu University: కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు

నాంపల్లి (హైదరాబాద్‌): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా నిర్వహించే వివిధ కోర్సుల ప్రవేశ ప్రకటనను మే 31న విడుదల చేశారు.
Applications for admission to Telugu University courses
తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు

2023–24వ విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. శిల్పం,చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు చరిత్ర, పర్యాటకం, భాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ, యూ­జీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది. ఆయా కోర్సులలో ప్రవేశం పొందగోరే విద్యార్థుల నుండి విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను జూన్‌ 16లోగా, ఆలస్య రుసుముతో జూన్‌ 30 లోగా విశ్వవిద్యాలయానికి సమర్పించాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో సూచించారు.  

చదవండి: Telugu University: కీర్తి పురస్కారాలు.. ఎంపికైనవారు వీరే..

2023–24 పీహెచ్‌డీ ప్రవేశాలు 

భాషా శాస్త్రం, సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, జానపద గిరిజన విజ్ఞానం తదితర అంశాలలో తెలుగు విశ్వవిద్యాలయం 2023–24వ విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను చూడాలని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో సూచించారు.

చదవండి: భారతీయ భాషలతోనే పాలన

Published date : 01 Jun 2023 01:40PM

Photo Stories