వైద్య, ఆరోగ్యశాఖలో త్వరలో నియామకాలు చేపడుతున్న తరుణంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది.
టీవీవీపీ సర్వీస్ రూల్స్‌లో మార్పులు
ఈ మేరకు సవరణ ఉత్తర్వులతో నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విభాగం పరిధిలో నియమించనున్న వైద్యులను సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా విభజించారు. వీరిని ఎంబీబీఎస్ అర్హతతో నియమిస్తారు.
గతంలో సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాలను నియమించలేదు. ఇప్పుడు వీటిని కొత్తగా నియామకాల్లో చేర్చారు.
పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ తప్పనిసరిగా రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.
టీవీవీపీలో కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుంది.
బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసిన అర్హులైన నర్సులను నేరుగా నియమిస్తారు. దరఖాస్తు చేసుకునే నర్సులందరూ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
క్లాస్ ఏ పారామెడికల్ పోస్టులకు.. సర్టిఫికెట్ ఆఫ్ రేడియాలజీ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇమేజియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వీరందరూ రాష్ట్ర పారామెడికల్ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.