AP NIT: ప్రవేశాలు రద్దు
ప్రవేశాలకోసం అర్హులైన అభ్యర్థులు చెల్లించిన ఫీజులను త్వరలో వెనక్కి ఇవ్వనున్నారు. ఇటీవల నిట్‌లో జరిగిన 16వ సెనేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. MBA కోర్సు కోసం శాశ్వత ప్రాతిపదికన ఉండే ఫ్యాకల్టీలు లేకపోవడం, అంతర్గత సమస్యలు, విధానపరమైన నిర్ణయాలలో సందిగ్ధస్థితి, కార్యాచరణకు అవకాశాల్లేని నేపథ్యంలో ఈ కోర్సును ప్రారంభించకుండానే రద్దు చేసినట్టు తెలుస్తోంది. ప్రవేశాలు రద్దుకు సంబంధించిన సమాచారాన్ని సంస్థ వెబ్‌సైట్‌లో జూలై 12న ఉంచారు. MBA ప్రవేశాలు 2022–23కు సంబంధించి లేవనే విషయాన్ని ఇన్‌చార్జి రిజిస్ట్రార్ దినేష్ పి.శంకరరెడ్డి నిర్ధారించారు.
చదవండి: AIMA UGAT 2022: ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ, బీహెచ్‌ఎం, బీసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు..
ఆదినుంచి అవాంతరాలే
నిట్‌లో ఉన్న బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంఎస్ బై రీసెర్చ్‌లతో పాటు కొత్తగా ఎంబీఏ కోర్సును 60 సీట్లతో ప్రారంభించనున్నట్టు 2021లో ప్రకటించారు. 2022–23కి నిట్‌లోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్‌మెంట్ కింద ఎంబీఏ ప్రారంభించనున్నట్టు, 60 సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంటూ ప్రకటన జారీ చేశారు. దరఖాస్తుల గడువును 2022 జనవరి 31 వరకు ఇచ్చారు. ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో గడువును ఫిబ్రవరి 28 వరకు పెంచారు. ఆ మేరకు వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్టు చేశారు. మార్చిలో 39 మంది ఈ కోర్సుకు అర్హత సాధించినట్టు దరఖాస్తులను ఐడీలతో వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
చదవండి: Osmania University: ఓయూలో పార్ట్‌టైం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు