Skip to main content

BBA Retailing: ‘బీబీఏ రిటైలింగ్‌’కు ఉజ్వల భవిష్యత్తు

కరీంనగర్‌ సిటీ: బీబీఏ రిటైలింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కళాశాల విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రొ.రాజేందర్‌సింగ్‌ అన్నారు.
Prof. Rajendersingh Highlights BBA Retailing Opportunities, KarimnagarCityBright future for BBA Retailing Course, Education Director Encourages BBA Retailing Admission for a Promising Career,

కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో న‌వంబ‌ర్‌ 25న‌ బీబీఏ రిటైలింగ్‌ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీబీఏ రిటైలింగ్‌ విద్యార్థులకు వారంలో మూడు రోజులు చదువు, మూడు రోజులు పరిశ్రమల్లో శిక్షణ ఇప్పించనున్నామని తెలిపారు.

చదవండి: రైతులకు ఎరువుల హోం డెలివరీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?

ఇందుకోసం విద్యార్థులకు తగిన పారితోషకం లభిస్తుందని, కోర్సు పూర్తయిన తర్వాత వారి కాళ్లపై వారు నిలబడతారని అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి కోర్సులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీ చైతన్య, వాగేశ్వరి డిగ్రీ కళాశాలలను సందర్శించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, కామర్స్‌ విభాగాధిపతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ టి.రాజయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రమోద్‌, సురేందర్‌ రెడ్డి, రాష్ట్ర జీసీజీటీఏ ప్రధాన కార్యదర్శి ఏవో కామరాజు, రవి సీసీఈ ఆఫీస్‌ హైదరాబాద్‌, కళాశాల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 28 Nov 2023 10:02AM

Photo Stories