రైతులకు ఎరువుల హోం డెలివరీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?
Sakshi Education
రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) నుంచి రైతుల ఇళ్లకే నేరుగా ఎరువులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
చదవండి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతులకు ఎరువుల హోం డెలివరీ కార్యక్రమంప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఇందుకు సంబంధించిన పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వర్షన్, ఎస్‌ఎంఎస్ సర్వీసును సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో ఆర్‌బీకే నుంచి రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు ఎరువుల హోం డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
సీఎం మాటల్లోని ముఖ్యాంశాలు
- నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారు. ఆర్‌బీకే కేంద్రాలు రైతులకు అన్ని విధాలా సహాయ కారిగా ఉండేలా చర్యలు తీసుకున్నాం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీకే కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్, స్మార్ట్ టీవీ, వైట్ బోర్టు, కుర్చీలు, డిజిటల్ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలు ఏర్పాటు చేశాం.
- రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను డిజిటల్ కియోస్క్‌ల ద్వారా బుక్ చేసుకుంటే, 24 గంటల నుంచి 48 గంటలలోగా వాటిని సరఫరా చేస్తాం.
- ఆర్బీకేల వద్ద 155251 నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇప్పటి దాకా ఈ సెంటర్‌కు రైతుల నుంచి 46,500 కాల్స్ వచ్చాయి.
- ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు, పశు సంవర్థక, మత్స్యసాగుకు అవసరమైన వాటిని కూడా ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నాం. అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం.
చదవండి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతులకు ఎరువుల హోం డెలివరీ కార్యక్రమంప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవియా
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
Published date : 01 Oct 2020 05:18PM