అంబేడ్కర్ గురుకులాల ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఆయన విజయవాడలో మే5న విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, భద్రత, కాస్మొటిక్ అలవెన్సులు, కంప్యూటర్ శిక్షణ, యోగా, క్రీడలు, వృత్తి విద్య మొదలైన అంశాల్లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. అంబేడ్కర్ గురుకులాల్లో ఐదో తరగతిలో 14,940 సీట్ల కోసం 61,670 మంది, ఇంటర్‌లో 13,560 సీట్ల కోసం 42,831 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సీట్ల భర్తీ కోసం ఏప్రిల్ 24న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు కూడా పంపినట్టు తెలిపారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జున నాయక్, అంబేడ్కర్ గురుకులాల కార్యదర్శి ఆర్.పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్: http:// apgpcet.apcfss.in