Telangana University: విద్యాసంస్థల్లో అకడమిక్ వాతావరణం నెలకొల్పాలి
ఆగస్టు 2న తెయూ క్యాంపస్‌లో అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో రిజిస్ట్రార్ మాట్లాడారు. కోవిడ్ కాలంలో విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. తరగతి గది ద్వారానే విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సామాజిక, నైతిక, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించవచ్చన్నారు.
చదవండి: TU Outsourced Staff: ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
ఈ విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి అర్హులైన విషయ నిపుణులను ఎంపిక చేసుకొని యూనివర్సిటీ నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కళాశాలల బకాయిలను సకాలంలో చెల్లించాలని అన్ని కళాశాలల్లో ల్యాబ్, గ్రంథాలయ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆకస్మి క తనిఖీలు ఉంటాయని నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆడిట్‌సెల్ జాయింట్ డైరెక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరీతో పాటు వర్సిటీ పరిధిలోని 60కి పైగా అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
చదవండి: Exams Postponed: యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా... కారణం ఇదే!