Skip to main content

Exams Postponed: యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా... కారణం ఇదే!

ఈ నెల 17న జరగాల్సిన డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు వాయిదా. ప్రాక్టికల్‌ పరీక్ష తేదీల్లో మార్పు
University Exams Postponed

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17న జరగాల్సిన డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలను బోనాల పండుగ కారణంగా వాయిదా వేసినట్లు కంట్రోలర్‌ ఎం అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలను తిరిగి 18న నిర్వహిస్తామని తెలిపారు.

Fresher Jobs in Amazon: ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం మీదే!

ఐదో సెమిస్టర్‌ పరీక్ష ప్రశాంతం

తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఐదో సెమిస్టర్‌ బ్యాక్‌లగ్‌ పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షలో ఆరుగురు విద్యార్థులకు అందరూ హాజరైనట్లు కంట్రోల్‌ తెలిపారు.

ప్రాక్టికల్‌ పరీక్ష తేదీల్లో మార్పు

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ ప్రాక్టికల్‌ పరీక్షల తేదీల్లో మార్పు చేసినట్లు కంట్రోలర్‌ తెలిపారు. సెట్‌–1 గ్రూప్‌–ఏ సంబంధిత కళాశాలల్లో ఈ నెల 19 నుంచి 24 వరకు, గ్రూప్‌–బీ కళాశాలల్లో ఈ నెల 27 నుంచి ఆగస్ట్‌ 2వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే సెట్‌– 2 లో స్టాటిస్టిక్స్‌ ప్రా క్టికల్‌ /ప్రాజెక్టు పరీక్షలు గ్రూప్‌– ఏ సంబంధిత కళాశాలల్లో జూలై 25, 26వ తేదీల్లో, గ్రూప్‌– బీ సంబంధించిన కళాశాలల్లో ఆగస్ట్‌ 3, 4వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్‌ తెలిపారు.

Published date : 15 Jul 2023 03:48PM

Photo Stories