Don't Miss: ఈ యూనివర్సిటీ పరిధి ఇంజనీరింగ్ విద్యార్థులకు సువర్ణావకాశం... నేవల్ డాక్‌యార్డ్‌లో 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్!
ఆంధ్రా యూనివర్సిటీ, దాని గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు సువర్ణావకాశం లభించనుంది. నేవల్ డాక్‌యార్డ్‌లో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కలగనుంది.
Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!
ఇందుకు సంబంధించి ఏయూ వీసీ ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సమక్షంలో నేవల్ డాక్‌యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్, రియర్ అడ్మిరల్ సంజయ్‌సాధు, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.కృష్ణమోహన్‌లు మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీని ప్రకారం ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైరెన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
ఈ సందర్భంగా ఏయూ వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రక్షణ రంగంతో ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మక విషయమన్నారు. విద్యార్థులు డిఫెన్స్‌లో అధునాతన సాంకేతికతపై 24 వారాల పాటు అధ్యయనం చేసే అవకాశం లభించడం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం భారత సాయుధ దళాలతో ఇప్పటి వరకు 30 ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు చెప్పారు.
Tech skills: సైబర్ సెక్యూరిటీ.. కెరీర్ అవకాశాలు, అర్హతలు, నైపుణ్యాలు అందుకునేందుకు మార్గాలు
కార్యక్రమంలో నేవీ నుంచి హెచ్‌ఆర్ జీఎం కమడోర్ అనూప్ మీనన్, హెచ్‌ఆర్ అడిషినల్ జనరల్ మేనేజర్ కమడోర్ ఆర్.వెంకటేశ్వరన్, డిప్యూటీ జీఎం(క్యూఏ) కెప్టెన్ సుబ్రతో మండల్, ఏయూ సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అడ్జంక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్ పాల్గొన్నారు.