Skip to main content

Department of Education: రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
Department of Education
రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు

ఈ దిశగా ఆగస్టు 29న విద్యాశాఖ జీవో జారీ చేసింది. వీటి ఏర్పాటుకు రికరింగ్‌ బడ్జెట్‌గా రూ.60 లక్షలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లాల విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల్లో 20 కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించగా, ఆయా ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 2014లో రాష్ట్రంలో 391 కేజీబీవీలుండేవి. 2017–18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరు చేశా రు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కు చేరింది. తాజాగా మంజూరైన వాటి తో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య, మరో 230 కేజీబీవీలను పదోతరగతి వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: Telangana: విద్యాప్రమాణాల ‘ఉన్నతి’ కోసం ఈ ప్రోగ్రాం

కొత్తగా ఏర్పాటు చేసినవి ఇవే.. 

మావల (ఆదిలాబాద్‌), బీర్‌పూర్, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్‌), దంతాలపల్లి (మహబూబాబాద్‌), మహ్మదాబాద్‌ (మహబూబ్‌నగర్‌), నార్సింగి, నిజాంపేట, హవేలి, ఘన్‌పూర్‌ (మెదక్‌), నిజామాబాద్‌ (సౌత్‌), నిజామాబాద్‌ (నార్త్‌), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్‌పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్‌ (వికారాబాద్‌).
చదవండి: KGBV Posts: కేజీబీవీ నియామకాల్లో గందరగోళం

Published date : 30 Aug 2023 01:41PM

Photo Stories